Tuesday, May 14, 2024

నిజమైన భక్తులు -సాధారణంగా కష్టాలు ఏర్పడినప్పుడే మనిషికి భగవంతుడు గుర్తుకొస్తాడు .మనిషి సుఖాల్లో మునిగితేలే సమయములో భగవంతుణ్ణి గుర్తు చేసుకోవడం

 నిజమైన భక్తులు -సాధారణంగా కష్టాలు ఏర్పడినప్పుడే మనిషికి భగవంతుడు గుర్తుకొస్తాడు .మనిషి సుఖాల్లో మునిగితేలే సమయములో భగవంతుణ్ణి గుర్తు చేసుకోవడం 

అనేది చాలా అరుదు .ఇలా మరచిపోతామనే 

భయముతో "నాకు ఎల్లప్పుడూ కష్టాలే ఎదురయ్యేలా చూడు ,సుఖాలలో పడి నీకు 

దూరమయ్యే స్ధితి లేకుండా చేయి 'అని దేవుణ్ణి 

వేడుకున్న భక్తులు సైతం మనకు పురాణాల్లో 

కనిపిస్తారు .అయితే కష్టాలనూ సుఖాలనూ కూడా 

దేవుని ప్రసాదంగా స్వీకరించాలన్నది -చాలామంది 

అభిప్రాయము .ఒక భక్తుడి భక్తిశ్రద్ధలకు దేవుడే 

మురిసిపోయి ఒకసారి నిజంగానే ప్రత్యక్షమయి 

అడిగాడట -"నీకు నామీద ఇంతటి గురి ఎలా కుదిరింది ? ఇంత గాఢమైన భక్తి ఎలా కలిగిందో 

చెప్పు ? " అని .వేంటనే ఆ భక్తుడు నమస్కారము 

చేసి " స్వామీ ! ఇదిఅంతా నీ పుణ్యమేకదా !ఏమీ 

తెలియనట్లు అడుగుతావేమి ? నీ చలవతో నాకు 

గంపగయ్యాళి భార్యగా లభించింది .అతి త్వరలోనే జీవితం మీద విరక్తి కలిగి, నీకు భక్తుడిగా మారాను .ఇదంతా నీ ప్రసాదమే .ఈ భక్తి 

శ్రద్ధలు అన్నియు నీ అనుగ్రహమే "అన్నాడట .

దీనికి ఏమి బదులివ్వాలో తెలియక ,దేవుడు మరో భక్తుడి దగ్గరకి వెళ్లి ఇదే ప్రశ్న అడిగాడట .

దానికి రెండో భక్తుడు సమాధానం ఇస్తూ ," ప్రభూ !

ఇదంతా నీ దయ  .నీ అనుగ్రహమే .నాకు అనుకూలవతి అయిన చక్కని భార్యను ప్రసాదించావు .ఆవిడ నా గృహాన్ని ఎంత సమర్ధంగా నిర్వహిస్తుందంటే -నేను నిశ్చింతగా ,

హాయిగా ,అనందంగా నీకు సేవ చేసుకొంటున్నాను 

ఇంతటి సౌఖ్యాన్ని ప్రసాదించినందుకు ,ప్రతి క్షణమూ నీకు కృతఙ్ఞతలు చెల్లించుకొంటున్నాను"

అని అన్నాడట .

ఈ ఇద్దరిలో మొదటి భక్తుడు భక్త తుకారామ్ కాగా రెండో భక్తుడు సంత్ ఏకనాధ్ మహరాజ్ .

వీరిద్దరినీ ప్రశ్నించినవాఁడు పండరినాధుడైన 

పాండురంగడు .ఈ భక్తులిద్దరి తీరూ గమనిస్తే 

విరక్తి ,రక్తి ,కూడా భక్తి కి కారణాలుగా కనిపిస్తాయి 

కష్టాలూ ,సుఖాలూ రెండూ భగవంతుని ప్రసాదాల

No comments:

Post a Comment