Tuesday, May 14, 2024

అవతార్ మెహర్ బాబా దివ్య సందేశం:* *" నేను బోధించుటకు రాలేదు. మేల్కొలుపుటకు వచ్చాను.*

 *అవతార్ మెహర్ బాబా దివ్య సందేశం:*


*" నేను బోధించుటకు రాలేదు. మేల్కొలుపుటకు వచ్చాను.*


 *అందువలన నేను ఎట్టి నియమ నిబంధనలు విధించుట లేదు. ఎందుకనగా మానవులు వాటిని పాటించుటకు ఆసక్తి లేదు.*

*భగవంతుడు చెప్పినది మానవుడు ఆచరించకపోవుటవల్ల అవతార పురుషుల బోధలు అపహాస్యమునకు* 

*గురి అగుచున్నవి.*

*అవతార పురుషుడు బోధించిన కరుణ ఆచరణలో పెట్టుటకు మారుగా, అతని పేరుతో మారణకాండ సాగిస్తున్నాడు.*

*వినమ్రత, పవిత్రత సత్యం జీవితములో ఆచరించుటకు బదులుగా మానవుడుద్వేషం, దురాశ, కోరికలకు లోనగుచున్నాడు.*

*గతంలో భగవంతుడు ఏర్పరిచిన నీతి, ధర్మాలను పెడచెవిని పెట్టుట చేత ఈ అవతారంలో మౌనం వహించియున్నాను.*

*మీరు అడుగుటవల్ల కొన్ని అవసరమైన మాటలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ మాటలు ఆచరించవలిసిన సమయం ఆసన్నమైంది.*

*భగవంతునికి సన్నిహితంగా చేరుటకు, నేను,నాది, నా యొక్క అను పదములు జీవితములో దూరముగా పెట్టవలిసియున్నది.*


 *షిర్డీ సాయిబాబాచే "పర్వర్థిగర్ "అని కీర్తించబడిన మెహర్ బాబా వారి 55 వ వర్ధంతి. మెహర్ బాబా జనవరి 31 ,1969 సం. న దేహత్యాగం చేసారు.*

*మెహర్ బాబా వారి అనుచరులు ఈ రోజు "అమర తిధి" గా ఆచరిస్తారు.*


*31 -1 -2024 మెహర్ బాబా వారి 55 వ  అమర తిథి లేదా వర్ధంతి*

No comments:

Post a Comment