Tuesday, May 14, 2024

సాయిభక్తుడైన దాసగణు మహరాజ్ ఉల్లిపాయ అంటే అస్యహించుకొనేవాడు .

 సాయిభక్తుడైన దాసగణు మహరాజ్ ఉల్లిపాయ 

అంటే అస్యహించుకొనేవాడు .ఒకసారి సాయబాబా దాసగణు ని ఉల్లిపాయ మసాలా 

తయారుచేసి ,కొంత తిని మిగిలింది తీసుకు రమ్మని అన్నాడు .ఏలాగో ఉల్లిపాయలు తెచ్చి ,

మసాలా తయారుచేసాడు దాసగణు .దానిని వేలికొనలతో తాకి ,ఆ వేలిని పెదవికి తాకించుకొని 

తినినట్లు భావన చేసుకుని ,నోరు శుభ్రం చేసుకుని 

ఉల్లిమసాలా తీసుకుని ద్వారకామాయి కి వెళ్లి 

సాయిబాబాకి సమర్పించాడు ." నీవు తిన్నావా ?

అని బాబా ప్రశ్నించాడు ." తిన్నాను " అని సమధానమిచ్చాడు దాసగణు .అది విన్న బాబా 

ఆక్కడివారితో ," ఈ దాసగణు నటిస్తున్నాడు .

వేళ్ళతో పెదవులను ఉల్లిని తాకాడు ".అని దాసగణు తన నివాసంలో ఎలా చేసాడో ఆలాగే 

చేసి చూపాడు సాయబాబా .దాసగణు బిక్కచచ్చిపోయాడు .అసలు బాబా తన నివాసంలో చేస్తున్నట్లు చూసి చెప్పాడే ? ఎలా ?

అని అనుకున్నాడు .అదిమొదలు దాసగణు తన 

నడవడిక మార్చుకున్నాడు .ఏకాదశి నాడు తప్ప 

ఇతర దినాలలో ఉల్లిపాయను దాసగణు తినేవాడు .ఒక రోజు బాబా ద్వారకామాయిలో 

వుండగా ,అక్కడే ఉన్న మరొక భక్తుడైన బాపూసాబ్ జోగ్ తో " రేపు ఏకాదశికదా ! నీవు 

ఉల్లిపాయలతో అయిదు శేర్ల కిచడి తయారు చేసుకుని తీసుకురా ! "అన్నాడు బాబా .జోగ్ కు 

ఉల్లి అంటే ఇష్టపడదు .పైగా ఏకాదశినాడు బాబా 

కిచడి తెమ్మన్నాడు .సరే ! అని జోగ్ మరునాడు 

కిచడి తయారుచేసి తీసుకొచ్చాడు .బాబాకు ఆ కిచడి నివేదించాడు .సాయబాబా నవ్వి ,ఆ కిచడిలో కొంతభాగము నోట్లో వేసుకొని ,

కొంచం కిచడిని జోగ్ ను తినమని అదేశించారు .

జోగ్ కర్మిష్ఠి అయినా సందేహించలేదు .తన గురువు వాక్కును శిరసావహించదలచాడు .

బాబా చెప్పినట్లే నోట్లో వేసుకున్నాడు .గురువు వాక్కు వేదవాక్కు .వారి అదేశాన్ని పాటించ వలిసిందే .ఒకసారి గురువును నమ్మిన తరువాత 

వెనుకకు పోరాదు .నిజమైన భక్తి అంటే గురువు 

చెప్పింది పాటించడమే .

No comments:

Post a Comment