Tuesday, May 14, 2024

ఘానా శ్యామా సుందరా ! శ్రీధరా !* *" శ్రీకృషుని ద్వారకా నగరం ఇదే " అని అన్నాడు సాయిబాబా దాసగణు మహారాజ్ తో

 *ఘానా శ్యామా సుందరా ! శ్రీధరా !*

*" శ్రీకృషుని ద్వారకా నగరం ఇదే " అని అన్నాడు సాయిబాబా దాసగణు మహారాజ్ తో.*

*' నేను మురళీధరుడిని కానా, ఏం ? అని పలికాడు గోపాలరావు ముకుంద్ బుట్టితో.*

*సాయిబాబా కృషునిగా దర్శనమిచ్చాడు. లీలలు చూపాడు. అలసిపోయాడు.* *పవళించాడు. ఇక మేలుకొలుపు పాడాలి.*


*షిర్డి సాయి కి ఇచ్చే కాకడ హారతులన్నీ పాండురంగ పరంగానే వున్నాయి.*


*పాండురంగడు శ్రీకృష్ణుని రూపాంతరమే కానీ మురళీధరుడు, గోపాలకృష్ణుడు కాదు కదా అయితే ఆ లోటు తీరింది.*


*కాకడ హరతి కంటే ముందుగా సాయిబాబా కు వినిపించే మూడు గీతాలలో మధ్య గీతం శ్రీకృషునికి చెందినదే.*


*" ఘనా శ్యామ సుందరా ! శ్రీధరా ! అరుణోదయ ఝాలా !..అంటూ మొదలవుతుంది.*


*ఈ మేలుకొలుపు గీతాన్ని రచించింది శ్రీ హోనాజీ బాల ( 1754 -1844  )*  


*ఈ 18 వ శతాబ్దికి చెందిన గీతాన్ని గాన గంధర్వులైన పండిత్ రావ్ నగర్ కర్, లతా మంగేష్ కర్, వీరివురూ కలసి గానం చేశారు 20 వ శతాబ్దంలో.*

*అసలు ఈ గీతం తెలియని మహారాష్ట్రుడు ఉండడు అంటారు.*

*మహారాష్ట్రుడే కాదు, యే సాయిభక్తుడు ఉండడు కూడా. హోనాజీ బాల శ్రీకృష్ణుని వలె గోపాలుడు.*


*"ఘానా శ్యామ సుందరా ! శ్రీధరా అరుణోదయమవుతుంది ...పక్షులన్నీ గూళ్ళ నుండి ఎగిరిపోతున్నాయి.* 


*గొల్లవాండ్రు కావళ్లను భుజాలకు తగిలించుకు పోతున్నారు.*


*గోప కాంతలు నడుమున బిందెతో యమునా తీరం వైపు పోతున్నారు .' లే ! వాసుదేవా ! లే !.లేగ దూడలు ఆకలితో " అంబా " అని అంటున్నాయి లేచి వాటికోసం పాలు పితుకు." అంటూ  హోనాజీ బాల, మనలను తెల్లవారు ఝామున వ్రేపల్లెకు తీసుకు పోతాడు.*


*హోనాజీ బాల కృతిలోని చివరి రెండు చరణాలు బాబాకు వినిపించరు.*


*" కోటి సూర్యప్రభలతో వెలిగే కృష్ణా ! నా హృదయములో నిలిచి పో ! " అంటారు హోనాజీ బాల.*

*ఘనా శ్యామసుందర గీతానికి - హోనాజీ బాలకు, భూపాలీ రాగానికి అమరత్వాన్ని ఆపాదించారు అలనాటి ప్రముఖ హిందీ సినీ దర్శకులు శ్రీ వి .శాంతారాం.*

*అమర భూపాలీ సినీ చిత్రం 1950  సం .లో విడుదలైనది.* 


*హోనాజీ బాల వ్రాసిన ఆ మధుర గీతాన్ని తెల్లవారు ఝామున విని ఆనందిద్దాం.*

No comments:

Post a Comment