*శ్రీ సాయినాథ అష్ట్తోత్తర శతనామావళి.*
*" ఓం పుణ్య శ్రవణ కీర్తనాయనమః ."*
*భగవత్ కధలు వినటం, కీర్తించటం రెండూ అంత్యత పుణ్యప్రదమైనవి.*
*భక్తులలో ఇవి రెండూ చోటుచేసుకొన్నవి*
*" నిరతము హరికథ లాలించుట, సతతము ఉన్నతిని స్తుతియించుట " ముక్తి మార్గానికి సోపానాలని సర్వశాస్త్రాలు,పురాణాలు ఘోషిస్తున్నాయి.* *సాయిబాబా ఎంతో స్పష్టంగా చెప్పారు ." నిరంతరం " సాయీ - సాయీ " అని పిలిస్తే సప్తసముద్రాల కావల ఉన్నా నిన్ను చేరుకొంటాను.*
*ఎల్లవేళలా నీతో ఉంటాను " అని, " నా కథలు నిరంతరము వింటూ, మననం చేస్తూవుంటే అదే మోక్ష సిద్ధికి మార్గం చూపుతుంది "అని అన్నారు.* *ఊరికే చెవిలో పడటంగాదు శ్రవణం అంటే.*
*ఆలా యధాలాపంగా విన్నందున పెద్దగా ప్రయోజనం చేకూరదు.*
*నామం చెవిన పడగానే హృదయం స్పందించాలి.*
*ఆ స్వామి గుణగణాలు, రూపము కూడా మనసులో మెదలాలి.*
*ఆలాగే కీర్తనం కూడా, కేవలం పెదవులు కదుపుతూ భజన చేయటం వలన, పాటలు పాడుట వలన, నామం పలకడం ప్రయోజనం ఏమీ వుండదు. దానితోపాటు భావన ఉండాలి.*
*మనసు వాటిపై లగ్నం కావాలి.*
*అప్పుడే దానికి సత్ఫలితం ఉంటుంది.*
*అట్టి ఫలితానిచ్చే ఆ స్వామికి నమస్కారం.*
No comments:
Post a Comment