Tuesday, May 14, 2024

హనుమాన్ చాలిసా ఆవిర్భావానికి సంబంధించి జనశృతిలో పలు గాధలు ఉన్నాయి.*

 *హనుమాన్ చాలిసా ఆవిర్భావానికి సంబంధించి జనశృతిలో పలు గాధలు ఉన్నాయి.*


*భర్త మరణించాడని విలపిస్తున్న ఒక యువతిని చూసి దయార్ధహృదయంతో తులసీదాస్ మృతదేహం వద్దకు వచ్చి రామనామం జపించగానే మరణించిన వ్యక్తి బ్రతికాడట.*


*ఈ వార్త నలుదిశలా వ్యాపించి అసంఖ్యాకంగా ప్రజలు గోస్వామి వద్దకి వచ్చి శ్రీరామనామ దీక్ష తీసుకొన్నారు.*


*తులసీదాసుకు పెరుగుతున్న జనాదరణను ఆ ప్రాంతంలోని మత గురువులు సహించలేక అతడిపై అక్బర్ పాదుషాకు చాడీలు చెప్పారు.*


*తులసీదాసును కొలువుకు పిలిపించిన పాదుషా మహిమలు ప్రదర్శించమన్నాడు.*

*తాను నిమిత్తమాత్రుణ్ణని అంతా దైవ నిర్ణయమని తులసీదాస్ బదులిచ్చాడు.*

*అతణ్ణి అహంకారిగా, వంచకుడిగా భావించి, నిర్బంధించవలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు అక్బర్.*


*రామభక్తుడైన తులసీదాసుకు సహాయంగా వానరసేన, కొలువులో ప్రవేశించి సైనికుల్ని భయభ్రాంతులను చేసింది.*


*ఆ సమయంలో తులసీదాసుకు హనుమ దర్శనమిచ్చాడని, అప్పుడు తులసీదాస్ చేసిన స్తోత్ర రాజమే ' హనుమాన్ చాలీసా ' అని భక్తుల విశ్వాసం.*


*రామచరిత మానస్ సుందరకాండ లోని " అతులిత బలధామము స్వర్ణ శైలాభ దేహం ....చాలీసాకు మకుట శ్లోకం వంటిది.*


*జ్ఞాన గుణాలకు సాగరం లాంటి వాడైన హనుమంతునికి జయం.*

*ముల్లోకాలను ఉజ్జ్వలింపచేసే కపిరాజుకు జయం ...అంటూ తులసీదాస్  స్తోత్రం ప్రారంభించాడు* 

*తులసీదాస్ హనుమను సద్గురువుగా కీర్తించాడు.*

*జానకి మాత వరం వల్ల అష్టసిద్ధుల్ని, నవనిధుల్ని ప్రసాదించగలడని హనుమను ప్రశంసించాడు.*

No comments:

Post a Comment