*సాయిబాబా ఒకసారి హేమాడ్ పంత్ అని పిలవబడే భక్తునితో " నీవు తినుటకు ముందు నన్ను ఙ్ఞప్తియందు ఉంచుకొనెదవా ? నేను నీ చెంత ఎల్లప్పుడూ ఉండలేదా ? నీవు తినుటకు ముందు నాకు అర్పించుచున్నవా ?" అని అంటారు సాయిబాబా చెప్పినట్లు ప్రవర్తించటం కొంచం కష్టమే.*
*ఆ సమర్పణను కేవలం ఆహారానికి పరిమితం చేయకుండా, అన్నింటికి వర్తింపచేసి, ప్రవర్తించటం ఇంకా కష్టమే.*
*ఆలా చేసినవారే భక్తీ సామ్రాజ్యంలో నిలబడతారు.*
*అటువంటి వారిలో మహా శివభక్తురాలైన అక్కమహదేవి ఒకరు.*
*ఆమె తన వచనాలలో ఇలా తెలుపుతారు.*
*" నేను తినక మునుపే జంగమమునకు,అమృతన్నాదుల నైవేద్యమిడుదు.*
*నేను కట్టుకొనక మునుపే జంగమమునకు దేవాంగది వస్త్రముల కట్టింతు.*
*నేను పూసుకొనక మునుపే జంగమమునకు సుగంధాది పరిమళములు పూయుదు.*
*నేను పువ్వులు పెట్టుకొనక మునుపే జంగమమునకు పరిపరి విధముల పూవులనిత్తు.*
*నేను భూషణములు ధరించుకొనక మునుపే జంగమమునకు భూషణములు ధరింతు.*
*నేనే యే భోగములు భోగించినను జంగమముకు భోగింపచేయనిదే నేను భోగించను.*
*బసవన్నా నీ ఆన నయ్యా చెన్న మల్లిఖార్జునా.*
*కర్ణాటక రాష్ట్రంలో ఉడుతది గ్రామమునందు జన్మించింది అక్కమహదేవి.* *తల్లితండ్రులు,సుమతి, నిర్మలశెట్టి.*
*అక్కమహదేవి బాల్యం నుండి త్రిలింగదేశము నందున్న శ్రీశైల మల్లిఖార్జునునే పతిగా గ్రహించింది.*
*"చెన్న మల్లిఖార్జునుడు గాక మిగిలినవారు నాకు సోదరులే " అంటుందామె.*
*ఇంకా ఆమె స్నేహితురాళ్ళతో " నా మగడు చెన్న మల్లికార్జునుడు.*
*మిగిలినవారందరూ మొగులు చాటున అగుపడు రంగు బొమ్మలే చూడరే "అని అంటుందామె.*
*ఆ అక్కమహదేవి కన్నడిగుల ఆడబిడ్డ. తెలుగువారి కోడలు.*
*ఆమె తన పుట్టింటినుండి మెట్టిన శ్రీశైలక్షేత్రము నందున్న కదళీవనం లో శివైక్యం అయ్యేవరకు ఆమె పలికిన వచనములు (పలుకులు )భక్తి జ్ఞానామృత గుళికలు.*
*"అక్కమహదేవి పాదములు తలచి తలచి నేను ధన్యుడైతిని " అంటారు మడివాలా మాచిదేవుడు.*
*"కపిల సిద్ధ మల్లికార్జునుని యందు గలిసిన మహాదేవి అక్కను శరణని సిద్ధుడు అయితిని, చూసితివా ! చెన్నబసవన్నా ! " అని అంటారు సిద్ధరామయోగి.*
*మనము కూడా పరమేశ్వరునికి ప్రీతికరమైన ఈ సోమవారము నాడు ఆ అక్కమహాదేవిని స్మరించెదము గాక.*
No comments:
Post a Comment