Tuesday, May 14, 2024

హేమాడ్ పంత్ సాయి సచ్ఛరిత్రలో, సాయిని "నిర్వికారయ నమః "అని కీర్తించుటలో అర్థమేమనగా, సాయి ఎట్టి మార్పులు, షడ్ వికారములు లేనివాడు, వుండుట, పుట్టుట పెరుగుట, మార్పు చెందుట ,క్షీణించుట, నశించుట, ఇవి షడ్ భావ వికారములు .అవి లేనివాఁడు సాయినాధుడు.*

 *హేమాడ్ పంత్ సాయి సచ్ఛరిత్రలో, సాయిని "నిర్వికారయ నమః "అని కీర్తించుటలో అర్థమేమనగా, సాయి ఎట్టి మార్పులు, షడ్ వికారములు లేనివాడు, వుండుట, పుట్టుట పెరుగుట, మార్పు చెందుట ,క్షీణించుట, నశించుట, ఇవి షడ్ భావ వికారములు .అవి లేనివాఁడు సాయినాధుడు.*

----------------------------------------

*సత్పురుషులు ఎన్నడూ ఇతరుల ధనము కానీ, ఇతర సంపదలు కానీ ఎన్నడూ ఆశించరు.*

*దత్తాత్రేయ భక్తుడైన ఏకనాధ్ మహరాజ్ మనుమడైన బావాజీ పంత్ మహరాష్ట్రలో నున్న ఛాఫల్  గ్రామానికి వెళ్లాడు.*

*అక్కడ ఛత్రపతి శివాజీ మహరాజ్ గురువు, అపర మారుతీ స్వరూపమైన సమర్థ రామదాస్ భక్తులను అనుగ్రహిస్తున్నారు.*

*బావాజీ పంత్ సమర్థ రామదాసులను దర్శించి, దగ్గరలోనున్న కృష్ణా నదిలో స్నానానికికని బయలుదేరాడు.*

*వ్యాపారం వృత్తిగల బావాజీ వద్ద ఆ సమయములో అతనివద్ద 101 మొహరీలు రూపంలో ధనము ఉన్నది. బావాజీ ఆ ధనాన్ని సమర్థ రామదాసుల కిచ్చి కృష్ణలో స్నానానికి వెళ్లాడు.*

*అప్పటికే విందు భొజనం ఏర్పాటు చేసిన సమర్థులు, భొజనం ముగించిన బ్రాహ్మణులకు, బావాజీ పంత్ తనకిచ్చిన సంచిలోంచి తీసి ఒక్కొక్కరికి ఒక మొహరీ అందరికీ ఇచ్చివేశారు.* 

*ఇదంతా చూసిన బావాజీ పంత్ ఏమీ అనలేక మౌనముగా ఉండి, అచ్చటనుండి సెలవు తీసుకుని తన గ్రామానికి వెళ్లిపోయాడు.*

*ఇంటికి వెళ్లిన బావాజీ విచారముగా ఉన్నందుకు తన తండ్రి కారణమడిగాడు.*

*అతడు బావాజీ తో "ఎందుకు విచారిస్తావు ? నీవు సంపాదించిన 101 మొహరీలు తృప్తిగా లేవా ? " అన్నాడు తండ్రి.**

*నూటొక్క మొహరీలు ఏమిటీ ? " అని ప్రశ్నించాడు బావాజీ.*


*ఇంతలో బావాజీ తండ్రి ఇంటిలోపలనుండి నూటొక్క మొహరీలు సంచి తెప్పించి చూపించి " ఇది నీవు నాకు పంపావు గదా ! అని అన్నాడు.*

*బావాజీతో అతని తండ్రి తనకు డబ్బు ఇచ్చిన వ్యక్తిని వర్ణించాడు.*

*ఆ వర్ణన సమర్థ రామదాసుకు సరిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు.*


*సత్పురుషులకు ఇతరుల ధనము అవసరం లేదు.*

No comments:

Post a Comment