*షిరిడీలో ఒకసారి సాయిబాబా గొండ్కర్ అనే వ్యక్తి ఇంటి పైకప్పు ఎక్కి మరల దిగారు.*
*ఈ సందర్బంగా సాయిబాబా ఎక్కటానికి ఒక నిచ్చెనను ఉపయోగించారు.*
*ఆ నిచ్చెనను తెచ్చిన వ్యక్తి కి రెండు రూపాయలిచ్చారు. ఆ రోజులలో అది చాలా ఎక్కువ మొత్తం. దానికి కారణం సాయిబాబా.*
*ఎవరివద్దా శ్రమభారాన్ని ఉచితంగా తీసుకోవద్దు.*
*ఎవరితోనైనా పనిచేయించుకోవచ్చు కానీ ఉచితంగా చేయించుకోరాదు అనే నియమాన్ని పాటించాలి " అని చెప్పేవారు.*
*కష్టము తగిన కూలి ఇవ్వని పక్షంలో మనం మోసగించేది తన చేతులతొ నిచ్చెన తెచ్చేవానినేకాదు, నిచ్చెన తేవడానికి శక్తిని ఇచ్చిన ఆ అదృశ్య భగవంతుని కూడా, మానవునితోపాటు భగవంతుడు కూడా అతని శ్రమలో భాగస్తుడు.*
*భగవంతుని సహకారం లేనిది మానవుడు ఒక అంగుళం కూడా కదలలేడు.*
*అలాంటప్పుడు భగవంతుని శ్రమకు ఎలా విలువ కట్టగలము ?*
No comments:
Post a Comment