Tuesday, May 14, 2024

మానవ జన్మ ఎత్తిన ప్రతీ ఆత్మ ఆ పరమాత్మను చేరుకోవడానికి సాధన చేసి తీరాలని, లేని పక్షంలో ఆ జీవితం వృధాఅవుతుందని పెద్దలు అందరూ చెప్పారు.*

 *మానవ జన్మ ఎత్తిన ప్రతీ ఆత్మ ఆ పరమాత్మను చేరుకోవడానికి సాధన చేసి తీరాలని, లేని పక్షంలో ఆ జీవితం వృధాఅవుతుందని పెద్దలు అందరూ చెప్పారు.*


*దీనికోసం ధ్యానయోగం, భక్తి యోగం,కర్మయోగం, జ్ఞానయోగం అని నాలుగు ప్రధాన మార్గాలు కూడా చూపించారు.*


*వీటిలో ఎవరి తత్వాన్ని అనుకూలమైన మార్గాన్ని వారు ఎంచుకొని దీక్షతో సాధన చేసి జీవనముక్తులు కావచ్చు.*

*ఇవన్నీ కూడా అలనాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా చెప్పబడినవి.*


*ఏ మార్గం అవలంబించినా, చివరకు జ్ఞానయోగంలో పర్యవసించిక తప్పదు.*


*ఈ చరాచర సృష్టి యావత్తూ - తనతో కూడా ఆ భగవంతుని వ్యక్తరూపంగా, భగవన్మయంగా తెలిసికోవడం, తెలిసినదానిని అనుభూతిపొందడమే జ్ఞానయోగం.*

 

*ఆ కృష్ణ పరమాత్మే షిరిడీలో సాయిబాబాగా అవతరించి, సర్వ జనులకు అత్యంత సులభముగా అర్థమయ్యేటట్లు, ఈ నాలుగు యోగాలను సమన్వయము చేసి, ఒక సులభ యోగాన్ని బోధించారు.*


*అదేమనగా " నువ్వెప్పుడూ నన్నే చూస్తుండు - నేను నిన్నే చూస్తుంటాను ". అదీ సూత్రం.*


*నిరంతరం ఆయనను స్మరించటమే ధ్యానయోగం.*


*జీవితాన్ని సమర్పణ భావంతో అంకితం చేయడమే భక్తి యోగం.*


*అన్నిటిలోను, అన్నింటిలోనూ ఆయననే చూస్తూ నిష్కామంగా సేవచేయడమే కర్మయోగం.*


*సర్వజీవుల నామ రూపాలను మరచిపోయి వాటిలోని దివ్యశక్తి అయిన సాయిబాబాను చూడగలగడమే జ్ఞాన యోగం.*

No comments:

Post a Comment