Tuesday, May 14, 2024

అలంకార ప్రియా విష్ణుహః* *అభిషేక ప్రియా శివహః* *నమస్కారప్రియా సూరయః* *గణేశ స్తర్పణ ప్రియమః* *హోమప్రియో మహేంద్రస్తు* *దుర్గ దేవ్యార్చన ప్రియా, దీప ప్రియమః కార్తవీర్యామః, దత్తస్తు స్మరణ ప్రియం "

 *" అలంకార ప్రియా విష్ణుహః* 

*అభిషేక ప్రియా శివహః* 

*నమస్కారప్రియా సూరయః*

*గణేశ స్తర్పణ ప్రియమః* *హోమప్రియో మహేంద్రస్తు* 

*దుర్గ దేవ్యార్చన ప్రియా, దీప ప్రియమః కార్తవీర్యామః, దత్తస్తు స్మరణ ప్రియం "*


*అని మంత్ర శాస్త్రములో ఆయా దేవతల లక్షణాలు ఎవరికేది ఇష్టం, ఎవరిని దేనివల్ల సంతోషపరచవచ్చు, అనేవి చెప్పబడ్డవి.*


*విష్ణు మూర్తికి అలంకారాలంటే ఇష్టం, అందుకే ఆయనను సర్వాంగముగా అలంకరిస్తుంటారు.*


*శివుడో ! ఆయన  అభిషేక ప్రియుడు. అందుకే ఆయనకు నమక చమకాలతో రుద్రాభిషేకాలు ఏర్పడ్డాయి. అయన తలమీద "హర హర "అని ఒక చెంబుడు నీళ్ళు పోస్తే చాలు ! పులకరించిపోతాడు ఆ భోళాశంకరుడు.*


*సూర్యునికి నమస్కరిస్తే చాలు, సంతోషిస్తాడు.*

*ఆరోగ్యము ప్రసాదిస్తాడు.* *అందుకే సూర్యనమస్కారాలు వచ్చినవి.*


*గణపతి విషయానికి వస్తె అయనకు ఏభై రకాల తర్పణాలు ఉన్నవి. ఆ తర్పణాలంటే ఆయనకు ఎంతో ఇష్టం.*


*ఇంద్రుడు దేవతలకు రాజు. త్రిలోక ములకు అధిపతి. ఆయనకు యజ్ఞ యాగాదులంటే ప్రీతి. వాటిలో ఆహుతులు స్వీకరించటమంటే ఆయనకు పండగ.* 

*నానా విధ పరిమళ పుష్పాలతో  సహస్ర నామపూజలు, అష్టోత్తర శతనామ పూజలు, కుంకుమ అర్చనలు చేస్తే పరమేశ్వరి సంతోషిస్తుంది.*

*దీపారాధన చేసి* 

*" కార్తవీర్యార్జునా ! కార్తవీర్యార్జునా ! కార్తవీర్యార్జునా ! " అంటూ మూడుసార్లు తలచుకొంటే సర్వ భాద విముక్తి కలుగుతుంది.*


*ఇక దత్తాత్రేయుని విషయానికి వస్తే, ఆయనకు పూజలు, అభిషేకాలూ, అలంకారాలతో పని లేదు, వట్టి అల్పసంతోషి.*

*" దత్తా ! దత్తా !  దత్తా !" అని ఆయనను స్మరిస్తే చాలు, రెక్కలు కట్టుకుని మన  ముందు వాలుతాడు. మన కోరికలు తీరుస్తాడు. అంతటి కరుణామూర్తి ఆ దత్త ప్రభువు.*


*అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తా !*

No comments:

Post a Comment